Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రోమాంచకం మూవీ.. లవ్-కామెడీ ఎంటర్‌టైనర్‌పై భారీ అంచనాలు

Romanchakam Movie Huge expectations on love-comedy entertainer
Advertisement
  • సందీప్ వంగా సమర్పణలో వస్తున్న చిత్రం 'రోమాంచకం'
  • ఇటీవలే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • సుమంత్ ప్రభాస్, అనంతిక జంటగా నటించిన ఈ సినిమా
  • సెన్సార్ పనులు పూర్తి..
  • సెప్టెంబర్ 3న థియేటర్లలోకి రానున్న 'రోమాంచకం'
Advertisement
'అర్జున్ రెడ్డి' చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆయన సమర్పణలో, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి నిర్మించిన తాజా చిత్రం 'రోమాంచకం'. 'మేము ఫేమస్', 'గోదారి గట్టుపైన' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో సుమంత్ ప్రభాస్ ఈ సినిమాలో కథానాయకుడిగా నటిస్తుండగా, అనంతిక సనిల్‌కుమార్ హీరోయిన్‌గా నటిస్తోంది. వేణు గోపాల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యువతను లక్ష్యంగా చేసుకున్న లవ్-కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు సోషల్ మీడియాలో మంచి స్పందన లభించడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

సెప్టెంబరు 3న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో దూకుడు పెంచింది. ఇందులో భాగంగా ఇటీవలే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి 'రౌడీ హీరో' విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరు కావడంతో చిత్రంపై హైప్ భారీగా పెరిగింది. అంతేకాదు, చిత్రబృందం ప్రెస్ మీట్లు, కాలేజ్ ఫెస్ట్ లతో దూసుకెళుతోంది. విజయవాడలోనూ చిత్ర యూనిట్ సందడి చేసింది.

ఇదిలా ఉండగా, 'రోమాంచకం' చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. చిత్ర నిడివిని 1 గంట 42 నిమిషాల 40 సెకన్లుగా ఖరారు చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.


Advertisement
Advertisement
Romanchakam
Sumanth Prabhas
Sandeep Reddy Vanga
Vijay Deverakonda
Romanchakam Release Date
Telugu Love Comedy Movie

More Telugu News